వైకాపా ప్రభుత్వం, నాయకుల తీరుపై అనంతపురంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. భాజపా ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఇచ్చిన నిధులను... గోడలకు పార్టీ రంగులు వేయటానికి వినియోగించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవటంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. రైతు భరోసా, 108 సేవలకు ప్రధాని నిధులిస్తుంటే కనీసం ఆయన ఫోటోకాని, కేంద్ర ప్రభుత్వం లోగో కాని లేకుండా అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
'ప్రధాని నిధులిస్తుంటే.. కనీసం ఆయన ఫోటో లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు' - భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తాజా వార్తలు
కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవటంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిధులిస్తుంటే కనీసం ఆయన ఫోటోకాని, కేంద్ర ప్రభుత్వ లోగో కాని లేకుండా అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి
ఏడాది కాలంలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏమి సాధించిందో.. శ్వేతపత్రం విడుదల చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. ఏడాది కాలంలో ఒక్క పేదవాడికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా అంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లు పూర్తిచేయకుండా, కొత్తగా మళ్లీ ఇళ్లు ఇస్తామంటున్న జగన్మోహన్రెడ్డి ఏడాదిలో సాధించిందేమీలేదన్నారు.
ఇదీ చూడండి.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన బుగ్గన బృందం
TAGGED:
anantapur bjp news