నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
'నీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' - భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తాజా సమాచారం
ఏపీ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కొందరు తెలంగాణ మంత్రులపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాయలసీమ ప్రాంతంలోని నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.. అన్ని పార్టీల మద్దతుతో తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేయాలన్నారు. అధికార పార్టీకి చెందిన రాయలసీమ ప్రాంత ప్రజా ప్రతినిధులు తెలంగాణ వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ..CBI CASE: సఖినేటిపల్లి ఎస్‌బీఐ అధికారిపై సీబీఐ కేసు నమోదు