ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా, తెదేపాలతో కలిసి ప్రయాణం చేయబోం: ఎమ్మెల్సీ మాధవ్ - అనంతపురం జిల్లా వార్తలు

రాష్ట్రంలో భాజపా.. వైకాపా, తెదేపాలతో కలిసి ప్రయాణం చేయదని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టంచేశారు. రాష్ట్ర రాజధానిపై మిగతా పార్టీలు భిన్నాభిప్రాయాలతో ఉంటే.. బాజపా మాత్రమే రాజధాని అమరావతి అంటోందని అన్నారు.

madhav, mlc
మాధవ్, భాజపా ఎమ్మెల్సీ

By

Published : Oct 15, 2020, 5:32 PM IST

ఆంధ్రప్రదేశ్​లో భారతీయ జనతా పార్టీ.. వైకాపా, తెదేపాలతో కలసి ప్రయాణం చేసే ప్రశ్నే లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అనంతపురంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాయన్నారు. దీనిపై రైతులకు ఉన్న అపోహలు తొలగించేందుకు జాగరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

రాయలసీమ ప్రాంతంలో పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పంట నష్టంపై అంచనా వేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిపై అన్ని పార్టీలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. కేవలం ఒక్క భాజపా మాత్రమే రాజధాని అమరావతి అని చెబుతోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details