ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భాజపాతోనే దేశ అభివృద్ధి, శాంతి, సుస్థిరత సాధ్యం' - bjp meeting in rayadurgam ananthapuram district

భాజపాతోనే దేశ అభివృద్ధి, శాంతి, సుస్థిరత సాధ్యమవుతుందని అనంతపురం జిల్లా భాజపా జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 100 మంది భాజపాలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

రాయదుర్గంలో భాజపా మండల, బూత్ కమిటీ సమావేశం
రాయదుర్గంలో భాజపా మండల, బూత్ కమిటీ సమావేశం

By

Published : Sep 30, 2020, 5:20 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో భాజపా పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షతన పార్టీ మండల, బూత్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంధి రెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం జిల్లా పార్లమెంట్ ఇంచార్జి కోనగిరి నీలకంఠ, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు జింక వసుంధర హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు భాజపాలోకి చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి అహ్వనించారు. భాజపాతోనే దేశ అభివృద్ధి, శాంతి, సుస్థిరత సాధ్యమవుతుందని సందిరెడ్డి శ్రీనివాసులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details