అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భాజాపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విషువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ చార్యీలు, ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక పేద ప్రజల నడ్డి విరిచేలా విద్యుత్ బిల్లులను పెంచారని విషువర్ధన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్య అతిధిగా వెళ్లిన జగన్మోహన్రెడ్డికి.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారనే విషయం అప్పుడు తెలియదా? అని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రజలను ఆదుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ భాజపా నేతల నిరసన - తాడిపత్రిలో భాజపా నేతలు ధర్నా
విద్యుత్ చార్జీల పెంపుని నిరసిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భాజపా నేతలు నిరసన చేపట్టారు. వైకాపా పాలనకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు.
bjp leaders