అనంతపురం జిల్లా హిందూపురం 1 టౌన్ సీఐ ఇస్మాయిల్‌ను సస్పెండ్ చేయాలని(BJP leaders demanded suspension of Hindupur 1 Town CI Ismail) భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణం(BJP leaders protest at Hindupur)లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతపురంలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌కి నిరసనగా భాజపా ఆధ్వర్యంలో హిందూపురంలోని సద్భావన సర్కిల్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వాహనాన్ని భాజపా శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో హిందూపురం 1టౌన్ సీఐ అసభ్య పదజాలంతో దూషిస్తూ.. భౌతిక దాడి చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ.. మా నాయకులపై దాడి చేసిన సీఐ ఇస్మాయిల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమ్య హామీ ఇవ్వడంతో భాజపా నేతలు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో భాజపా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి, భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్, తదితరులు పాల్గొన్నారు.