అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో భాజపా నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం పోలీస్స్టేషన్ ఎదుట భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. పట్టణ సీఐ కరుణాకర్ అక్రమ కేసులు పెడుతున్నారని, సీఐని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు సీఐ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు.
'అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు' - concern news in dharmavaram
అనంతపురం జిల్లా ధర్మవరం పోలీస్ స్టేషన్ ఎదుట భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యేకు సీఐ అనుకూలంగా మారి తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్మవరం పోలీస్ స్టేషన్ ఎదుట భాజపా నాయకులు ధర్నా