'అర్చకుడిపై దుర్భాషలాడిన పోలీస్‌పై చర్యలు తీసుకోండి' - hindhupuram bjp leaders dharna news
హిందూపురంలో పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా నాయకులు నిరసన తెలిపారు. పూజలు నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్తున్న అర్చకుడిపై దుర్భాషలాడి, జరిమానా విధించిన పోలీస్ అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు.
పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా నాయకులు నిరసన
అనంతపురం జిల్లా హిందూపురంలో పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈనెల ఒకటో తారీఖున ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్తున్న అర్చకుడిపై విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారి దుర్భాషలాడి జరిమానా విధించడంపై మండిపడ్డారు. తక్షణం ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. హిందూపురం ప్రాంతంలోని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్న అర్చకులకు అనుమతి పత్రాలను ఇవ్వాలని ఎమ్మార్వోను కోరారు.