ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమకేసులపై గవర్నర్​ను కలిసిన  భాజపా నేతలు - అక్రమకేసులపై గవర్నర్​ను కలిసిన  భాజపా నేతలు

అనంతపురానికి చెందిన భాజపా నాయకులు విజయవాడలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్​ను కలిశారు. అక్రమకేసులు ఎదుర్కొంటున్న తమ కార్యకర్తలపై స్వతంత్ర విచారణ జరిపేలా.. ఆదేశించాలని వారు కోరారు.

గవర్నర్​ను కలిసిన  భాజపా నేతలు

By

Published : Oct 14, 2019, 11:23 PM IST

అక్రమకేసులు ఎదుర్కొంటున్న తమ కార్యకర్తలపై స్వతంత్ర విచారణ జరిపేలా.. ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర భాజపా నేతలు గవర్నర్​ హరిచందన్​ను కలిశారు. వైకాపాకు చెందిన అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూలేకుండా పోయిందని భాజపా నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపా దాడులను ప్రశ్నించిన భాజపా కార్యకర్తలపై తప్పుడుకేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న తమ కార్యకర్తలపై స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. గవర్నర్​ను కలిసిన వారిలో ధర్మవరానికి చెందిన గోనుగుంట్ల సూర్యనారాయణ, పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు తదితరులు ఉన్నారు.

గవర్నర్​ను కలిసిన భాజపా నేతలు

ABOUT THE AUTHOR

...view details