అనంతపురం జిల్లా కదిరిలో భాజపా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతోందని... ఇందుకు ముగిసిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలే నిదర్శమన్నారు. తాజాగా ముగిసి మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో భాజపా బలపడుతోంది: దేవానంద్ - కదిరిలో భాజపా కార్యకర్తల సమావేశం
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతోందని భాజపా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ అన్నారు. ఇందుకు ముగిసిన మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని స్పష్టం చేశారు.

మాట్లాడుతున్న భాజపా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ దేవానంద్
భాజపా హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... హిందూపురంలో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించగా కదిరిలో మూడుచోట్ల రెండో స్థానంలో నిలిచామన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తమ పార్టీ ప్రణాళికబద్దంగా కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను.. నాయకులు అభినందించారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.