అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో రహదారుల మరమ్మతును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాజపా నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక యాదవ వీధి ప్రధాన రహదారిపై నిల్వ ఉన్న నీటి గుంతలో వరినాట్లు వేశారు. పట్టణంలో వర్షాలకు రహదారులు అధ్వానంగా మారి, గుంతలు పడి నీరు చేరిందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డుపై నీళ్లు.. భాజపా నేతల వినూత్న నిరసన - అనంతపురంలో వినుత్న నిరసన
అనంతపురం జిల్లాలో భాజపా నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్లపై నిలిచిన నీటిలో వరినాట్లు వేశారు. రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను కోరారు.
భాజపా నేతల వినూత్న నిరసన