ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని మోదీ ఏడేళ్ల పాలన.. అనంతలో సేవా కార్యక్రమాలు - today bjp leaders distribution essantial goods news update

అనంతపురం జిల్లాలో భాజపా నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

bjp leaders distribution essantial goods
అనంతలో సేవా కార్యక్రమాలు

By

Published : May 30, 2021, 7:44 PM IST

అనంతలో సేవా కార్యక్రమాలు

ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల పాలన పూర్తైన సందర్భంగా.. అనంతపురం జిల్లా హిందూపురంలోని సరస్వతీ విద్యామందిరంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో అన్నదానం చేపట్టారు. నూతనంగా ఏర్పాటైన ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించారు. వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో శ్రద్ధతో ఉన్నారన్నారు.

కదిరిలో భాజపా సేవా కార్యక్రమాలు..

కదిరి నియోజకవర్గంలో భాజపా నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గాండ్లపెంట మండలం బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో భాజపా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్ల కాలంలో ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలతో పాటు.. దేశాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. విజయోత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కదిరి ప్రాంతీయ వైద్యశాలలోని రక్త నిధి కేంద్రంలో దేవానంద్​తో పాటు భాజపా కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఇవీ చూడండి..

Aadhaar: పదేళ్లుగా ఇద్దరికీ 'ఒకే ఆధార్'.. 'ఈనాడు - ఈటీవీ భారత్' చొరవతో సమస్యకు పరిష్కారం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details