అనంతపురం జిల్లా ముదిగుబ్బ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. చోరీకి గురైన ద్విచక్ర వాహనం వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన భాజపా నాయకుడు సత్యనారాయణపై ఎస్సై శ్రీనివాసులు చేయి చేసుకోవడాన్ని తప్పుపట్టారు. గతంలోనూ ఎస్సై, న్యాయవాది పట్ల దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడాన్ని గుర్తు చేశారు. ముదిగుబ్బ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సై దెబ్బలకు గాయపడిన సత్యనారాయణను చికిత్స కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని భాజపా నాయకులు పరామర్శించారు.
ఎస్సైపై చర్యలు తీసుకోవాలని భాజపా నేతల డిమాండ్ - అనంతపురం జిల్లా తాజా వార్తలు
భాజపా నేత సత్యనారాయణపై ముదిగుబ్బ ఎస్సై చేయి చేసుకోవడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడిని కదిరి ఆసుపత్రికి తరలించారు.

బాధితుడిని కదిరి ఆసుపత్రికి తరలించిన భాజపా నాయకులు
ఇదీ చదవండి :