అనంతపురం జిల్లా కదిరిలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోరుతూ... బీజేవైఎం చేపట్టిన దీక్షను భగ్నం చేయటంపై భాజపా నాయకులు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఆమరణ దీక్ష చేపట్టిన వైకాపా నాయకులు, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్న హామీని... అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని విమర్శించారు. కదిరి శాసన సభ్యుడు సిద్ధారెడ్డి అవగాహన లేకుండా... తమపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
అప్పుడు దీక్ష చేశారు... ఇప్పుడెందుకు మాట్లాడటంలేదు..? - latest news in kadiri
ప్రతిపక్ష పార్టీల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను... భారతీయ జనతా పార్టీ నేతలు తప్పుపట్టారు.
' ఎన్నికల హామీను మర్చిపోయారు'
Last Updated : Dec 21, 2019, 11:38 AM IST