ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫ్లెక్సీల ధ్వంసంపై పోలీసులకు భాజపా ఫిర్యాదు - ananthapur district latest news

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే భాజపా నాయకుడు పుట్టినరోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైకాపా శ్రేణులు ధ్వంసం చేశారని భాజపా నాయకులు పోలీసులను ఆశ్రయించారు. ముదిగుబ్బ మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నందున పోలీసులు పికెటింగ్​ ఏర్పాటు చేశారు.

bjp leaders complaint on ex mla flexi issue in ananthapur district
మాజీ ఎమ్మెల్యే భాజపా నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ఫ్లెక్సీలు ధ్వంసం

By

Published : Jul 7, 2020, 12:14 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే భాజపా నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైకాపా శ్రేణులు ధ్వంసం చేశారు. దీనిపై ముదిగుబ్బ మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయంపై కదిరి డీఎస్పీ లాల్​ అహ్మద్​కు భాజపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముదిగుబ్బ పోలీసులు పికెటింగ్​ ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details