ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BJP Leader Vishnu on Cyclone damage : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి - భాజపా - తుపాను బాధితులకు ప్రభుత్వ తక్షణ సాయం

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు(Seeking Government help for cyclone affected people).. ప్రభుత్వం సత్వరమే సాయమందించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

BJP Leader Vishu on Cyclone damage
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి -భాజపా నేత విష్ణు

By

Published : Nov 21, 2021, 2:53 PM IST

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం (huge damage with cyclone in state) సంభవించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (AP BJP Secretary Vishnuvardan Reddy) విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను.. ప్రభుత్వం పెద్ద మనసుతో సత్వరమే ఆదుకోవాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో అపార నష్టం జరిగిందన్నారు. ఈ నష్టాన్ని అంచనా వేసేందుకు ఐదుగురు సభ్యుల భాజపా బృందం పర్యటించనున్నట్లు తెలిపారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్య కుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ టీజీ వెంకటేష్ తోపాటు తాను కూడా పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకుని.. ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలను సేకరించి, ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : Tirupathi Still in flood water : వరద నీటిలో తిరుపతి.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details