ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ సమ్మిట్‌తో భారీగా పెట్టుబడులు వచ్చాయంటూ మోసం చేస్తున్నారు: సత్యకుమార్​

BJP LEADER SATYA KUMAR ON GIS : రాష్ట్ర ప్రభుత్వం గతంలో దావోస్​లో చేసుకున్న ఒప్పందాలనే ఇప్పుడు విశాఖలో చేసుకున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్​ ఆరోపించారు. విశాఖకు వచ్చిన కంపెనీల చరిత్ర పరిశీలిస్తే కేవలం భూదందా కోసం చేస్తున్నదేనని విమర్శించారు.

BJP LEADER SATYA KUMAR ON GIS
BJP LEADER SATYA KUMAR ON GIS

By

Published : Mar 8, 2023, 2:07 PM IST

BJP LEADER SATYA KUMAR ON GIS : ఎలాంటి కసరత్తు లేకుండా కేవలం జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో గ్లోబల్ సమ్మిట్ పెట్టి మోసం చేశారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. గతంలో ఇచ్చిన జీవోలనే విశాఖకు కొత్త పెట్టుబడులు వచ్చినట్లు ఎన్నికల వేళ మోసం చేస్తున్నారన్నారు. గతంలో దావోస్​లో చేసుకున్న ఒప్పందాలను ఇపుడు చేసుకున్నట్లు చెబుతున్నారన్నారు.

"ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఒక్క విదేశీ పెట్టుబడిదారుడు రాలేదు. ఒక్క రూపాయి కూడా లేదు. అసలు దాని గురించి ప్రస్తావన లేదు. విదేశీ పెట్టుబడులు రావాలంటే ముందస్తు ప్రణాళిక ఉండాలి, చాలా ప్రయత్నాలు చేయాలి. అనేక దేశాల్లో రాష్ట్ర పరిస్థితి గురించి వివరణ ఇవ్వాలి. ఇప్పుడు దేశానికి నరేంద్ర మోదీ బ్రాండ్​. కానీ ఎక్కడా ఆయన ప్రస్తావన లేకుండా సదస్సు జరిగింది" -సత్యకుమార్​, బీజేపీ జాతీయ కార్యదర్శి

ప్రధాని మోదీ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా పెట్టుబడిదారులు ఎలా ముందుకు వస్తారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలన్నారు. కంపెనీలను విశాఖ సమ్మిట్​లో చూపించి భూములు కాజేయటానికి చూస్తున్నారన్నారు. విశాఖకు వచ్చిన కంపెనీల చరిత్ర పరిశీలిస్తే కేవలం భూ దందా కోసం చేస్తున్నదేనని, జగన్ మోహన్ రెడ్డి ఎవరిని మోసం చేస్తారని ఆయన విమర్శించారు.

"పెట్టుబడిదారుల సదస్సులో మొత్తం విశాఖ నగరమంతా కేవలం ఒక్క జగన్​ ఫొటో పెట్టి ప్రచారం చేసుకున్నారు. జీ20 కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే.. కేవలం జీఐఎస్​ ప్రచారం కోసం వాటిని వినియోగించారు"--సత్యకుమార్​, బీజేపీ జాతీయ కార్యదర్శి

వైఎస్సార్​సీపీ ప్రభుత్వం మాయమాటలతో మభ్యపెడుతోందని సత్యకుమార్‌ ఆరోపించారు. ఉద్యోగులను మభ్యపెట్టడానికే మంత్రివర్గ ఉపసంఘం అని మండిపడ్డారు. ఉద్యోగులు మీరు అనుకున్నంత అమాయకులు కాదని హితవు పలికారు. నాలుగేళ్లు మాట్లాడకుండా ఎన్నికల వేళ గ్లోబల్ సమ్మిట్ పెట్టారని.. సమ్మిట్‌కు ఒక్క విదేశీ పెట్టుబడిదారుడు రాలేదన్నారు.

"గతంలో దావోస్​లో చేసుకున్న ఒప్పందాలను.. ఇప్పుడు విశాఖలో జరిగిన సదస్సులో చూపించారు. ఇప్పుడు కొత్తగా చేసుకున్న ఒప్పందాలకు ఆరు నెలల క్రితమే జీవోలు విడుదల చేశారు. ఎప్పుడో జీవోలు విడుదల చేసి. భూమి కేటాయింపులు జరిగినాక మళ్లీ ఒప్పందాలు చేసుకోవడం ఏంటో"-సత్యకుమార్​, బీజేపీ జాతీయ కార్యదర్శి

శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల విషయంలో ఇప్పటి వరకు ఎన్నికల సంఘం కేసు నమోదు చేయలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.

డీజిల్​లో అక్రమాలు: రాష్ట్రంలో స్కీంలను వదిలేసి.. జగన్ మోహన్ రెడ్డి స్కాం లకు తెరలేపారని సత్యకుమార్ ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి డీజిల్ అక్రమంగా తీసుకొచ్చి ఆర్టీసీకి సరఫరా చేస్తున్నారన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఉన్న 51 ఆర్టీసీ డిపోలకు అక్రమ డీజిల్ సరఫరా చేస్తూ, ఈ మాఫియా మామూళ్లు ముట్టచెబుతోందని అన్నారు. రాష్ట్రంలోని డీజిల్ బంకుల నుంచి కొనుగోలు చేసినట్లు చూపించి, కర్ణాటక రాష్ట్రం నుంచి ట్యాంకర్ల ద్వారా తరలించి ఆర్టీసీ డిపోలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. డీజిల్ విక్రయించే డీలర్​కు లీటర్​కు రెండు రూపాయల 20 పైసలు కమీషన్ వస్తుంటే ఆర్టీసీకి అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఎలా ఇస్తారని సత్యకుమార్ ప్రశ్నించారు. డీజిల్ అక్రమ రవాణాలో ఎవరికి ఎంత ముట్టచెబుతున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details