రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాణిక్యుడికే అర్థం కాని రీతిలో ఉందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. అనంతపురంలో ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు.
'చాణిక్యుడికే అర్థం కాని రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి' - ap fainancial condition
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం కాని రీతిలో ఉందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఇష్టానుసారంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు చేయడం ఏంటని ప్రశ్నించారు.
bjp leader satya kumar
ఇష్టానుసారంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సొంత నిర్ణయాలతో జీవోలు జారీ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కట్టడిలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నా.. వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టకపోవడం వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఒక గట్టి నిర్మాణానికి భాజపా త్వరలో పునాది వేస్తుందని సత్యకుమార్ అన్నారు.
ఇదీ చదవండి:
COVID: ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలవరం..ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్
Last Updated : Aug 27, 2021, 1:56 PM IST