ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరెస్టులకు నిరసనగా అనంతలో భాజపా నేతల రాస్తారోకో - bjp chalo amalapuram latest news

అనంతపురం జిల్లా కదిరిలోని జాతీయ రహదారి 42 పై ఇందిరా గాంధీ కూడలిలో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. చలో అమలాపురానికి బయలుదేరిన నాయకులను.. అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు.

BJP leader Rastaroko
అనంతలో భాజపా నేతల ఆందోళనలు

By

Published : Sep 18, 2020, 2:03 PM IST

భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకుల అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలోని జాతీయ రహదారి 42 పై ఇందిరా గాంధీ కూడలిలో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర భాజపా పిలుపు మేరకు చలో అమలాపురానికి బయలుదేరిన నాయకులను.. అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు. అరెస్ట్ చేసిన నాయకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం.. భాజపా, జనసేన నాయకులను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details