ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే ఇసుక సత్యాగ్రహమే' - ఇసుక కొరతపై భాజపా

వారం రోజుల్లో ఇసుక కొరత సమస్య పరిష్కరించకపోతే ఇసుక సత్యాగ్రహం చేస్తామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యాలరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇసుక కొరతతో రాష్ట్రంలో ఎంతో మంది నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

ఇసుక సమస్యపై మాణిక్యాలరావు

By

Published : Oct 31, 2019, 1:33 PM IST

ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసిన భాజపా నేత మాణిక్యాలరావు

ప్రభుత్వం వారం రోజుల్లో ఇసుక కొరత సమస్య తీర్చకపోతే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం తరహాలో ఇసుక సత్యాగ్రహం చేస్తామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యాలరావు హెచ్చరించారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో కేవలం 15 రోజుల్లోనే 2 వేల కిలోమీటర్లకు పైగా భాజపా పాదయాత్ర చేసిందని అన్నారు.

మద్యం కొత్త పాలసీ తీసుకొచ్చే వరకు పాత పాలసీనే కొనసాగించిన సర్కారు... ఇసుక విషయంలో ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఇసుకంతా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలిపోతోందని ఆరోపించారు. ఇక్కడ మాత్రం నిర్మాణ రంగ కార్మికులు పనుల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details