చంద్రబాబు అసత్య ప్రచారంతోనే తమకు ఓట్ల శాతం తగ్గిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. చంద్రబాబు తమపై చేసిన ప్రచారం, తెదేపాపై వ్యతిరేకత వల్లే వైకాపాకు అన్ని ఓట్లు వచ్చాయన్నారు.అధికారంలోకి వచ్చి రెండునెలలు కాక ముందే వైకాపా నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని భాజాపా కూల్చలేదని.. వారికి వారే కూల్చుకున్నారని తెలిపారు. రేపు యాడియూరప్ప ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే... కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్రంలో భాజపా బలపడుతోంది: కన్నా - bjp
రాష్ట్రంలో భాజపా రోజురోజుకూ బలపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలో జరిగిన సంఘటన పర్వ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సంఘటన పర్వ్ కార్యక్రమంలో కన్నా..