'2024 ఎన్నికల్లో వైకాపా, భాజపా మధ్యే పోరు' - భాజపా నేత సునీల్ దేవధర్ వ్యాఖ్యలు
భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో తెదేపా, జనసేనతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
bjp-leader-comments-on-2024-elections-in-ap
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం భాజపాకు లేదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేయబోతోందన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పోరు వైకాపా, భాజపాల మధ్యే ఉండనుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత అధికార పార్టీతో తమకు ఎలాంటి అవగాహన లేదని సునీల్ దేవధర్ అన్నారు.
Last Updated : Oct 17, 2019, 8:55 PM IST