అనంతపురం జేఎన్టీయూ ఉపకులపతి శ్రీనివాస్ కుమార్‌పై సీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల యజమాని, భాజపా నేత చిరంజీవి రెడ్డి మండిపడ్డారు. కాకినాడలో పనిచేసినప్పుడే అక్రమాలకు పాల్పడ్డారని చిరంజీవి రెడ్డి ఆరోపణ చేశారు. ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 2 పార్టీల నాయకులు తనను బెదిరించారని వీసీ చేసిన ఆరోపణలపై స్పందించారు.
అనంతపురం జేఎన్టీయూలో వంద కోట్ల రూపాయల పనుల్లో పర్సెంటీజీలు పొందారని, సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు. జేఎన్టీయూకు కోట్ల రూపాయల బకాయి ఉన్న విషయంపై హైకోర్టు స్టే ఉందని చిరంజీవి రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రమాణాల గురించి మాట్లాడే అధికారం ఉపకులపతికి లేదన్నారు. తమను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే అక్రమాలన్నీ వెలికి తీస్తామని హెచ్చరించారు.