అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, దేవానంద్, వజ్ర భాస్కర్ రెడ్డి, జనసేన నాయకుడు భైరవ ప్రసాద్ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 6 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో 20 లక్షల గృహాలను కేటాయించిందన్నారు.
'బహుళ అంతస్తుల భవనాలు లబ్ధిదారులకు అందజేయాలి' - బహుళ అంతస్తుల భవనాలు లబ్ధిదారులకు అందజేయాలి
గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇల్లు.. కార్యక్రమంలో భాగంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను లబ్ధిదారులకు అందజేయాలని భాజపా, జనసేన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
!['బహుళ అంతస్తుల భవనాలు లబ్ధిదారులకు అందజేయాలి' bjp, jnasena protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8126068-415-8126068-1595409540266.jpg)
bjp, jnasena protest
గృహనిర్మాణంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ.. బహుళ అంతస్తులను అధికారులకు కేటాయించకుండా.. జగన్ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని నేతలు విమర్శించారు. బహుళ అంతస్తుల నిర్మాణంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు రుజువైతే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం వృథా కాకుండా 90 శాతం నిర్మాణాలు పూర్తైన బహుళ అంతస్తుల భవనాలను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....