ఉగ్రరాజ్యం పాకిస్థాన్‌పై భారత వాయుసేన నిర్వహించిన వైమానిక దాడులకు అభినందిస్తు అనంతపురంలో భాజపా నాయకులు సంబరాలు నిర్వహించారు. ప్రజలకు మిఠాయిలు పంచుతూ, బాణసంచా కాలుస్తూ నగరంలో ప్రదర్శన చేపట్టారు. జై భారత్.. జైజై భారత్ అంటు నినాదించారు.ఉగ్రవాదుల మరణంతో భారత ప్రజల ఆకాంక్షను తీర్చి పుల్వామా దాడిలో చనిపోయిన సైనికులకు నిజమైన నివాళి దొరికిందని ఆనందం వ్యక్తం చేశారు.పాక్‌పై దాడులు కేవలం ట్రైలర్ మాత్రమేనని..ముందు ముందు సినిమా చూపిస్తామని హెచ్చరించారు.
"ఇది ట్రైలర్ మాత్రమే" - anantapur
ప్రస్తుత వైమానిక దాడులు చిన్న ట్రైలర్ మాత్రమేనని పాకిస్థాన్ కి తొందర్లో సినిమా చూపిస్తామని అనంతపురం భాజపా నేతలు అంటున్నారు.
!["ఇది ట్రైలర్ మాత్రమే"](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2559116-782-06a5c67b-7796-4d8b-a603-a36f374e4bb0.jpg)
అనంతపురంలో ప్రదర్శన