గోరక్షణ చట్టానికి వ్యతిరేకంగా వైకాపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనంతపురం జిల్లా కదిరిలో ఆవుతో కలిసి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గోవుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలన్నారు.
హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రంలో వెంటనే గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని అనంతపురం భాజపా నాయకులు డిమాండ్ చేశారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పై కేసులు నమోదు చేయాలన్నారు. ఆవుతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. గోవుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.