రాష్ట్రంలో హిందూ ఆలయాలు, ధార్మిక సంస్థలపై పెరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని... భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం అల్లుగుండు వద్ద శివాలయం భూమిలో సచివాలయ నిర్మాణాన్ని ఆపాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శివుడి ఆలయానికి సంబంధించిన భూమిలో రాత్రికి రాత్రే సచివాలయం నిర్మాణానికి పునాదులు వేసిన అధికారులు, గుత్తేదారులపై కేసు నమోదు చేయాలన్నారు. దేవాలయాలు ధార్మిక సంస్థల ఆస్తులు అన్యాక్రాంతం అయితే భాజపా ఊరుకోదని హెచ్చరించారు.
ఆలయ భూమిలో సచివాలయ నిర్మాణాన్ని ఆపాలి: విష్ణువర్ధన్ రెడ్డి - bjp leader vishnuvardhan reddy agitation on ycp
వైకాాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలు, ధార్మిక సంస్థలపై పెరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అనంతపురంలోని శివాలయం ఆలయ భూమిలో సచివాలయం నిర్మాణ పనులు ఆపాలని డిమాండ్ చేశారు.
ఆలయ భూమిలో సచివాలయ నిర్మాణాన్ని ఆపాలి: విష్ణువర్ధన్ రెడ్డి