ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడకశిర సచివాలయంలో పుట్టినరోజు వేడుకలు..

కరోనా నియంత్రణలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఉద్యోగులే బాధ్యతారహితంగా వ్యవహరించటం పలు విమర్శలకు దారితీస్తోంది. సాక్షాత్తూ సచివాలయంలోనే సిబ్బంది పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. భౌతిక దూరం లేదు... గ్లౌజులు అసలే లేవు.. కరోనా భయం కానేరాదు అన్నట్లు వ్యవహరించిన సిబ్బంది ప్రవర్తనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణం సచివాలయంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

By

Published : Aug 7, 2020, 1:41 PM IST

birthday celebrations in anantapur dst madakasira Secretariat
birthday celebrations in anantapur dst madakasira Secretariat

మడకశిర సచివాలయంలో పుట్టినరోజు వేడుకలు..

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో సాయినగర్ వీధిలోని 14, 15, 16 వార్డుల సచివాలయంలో ఓ ఉద్యోగి జన్మదినం సందర్భంగా విందు ఏర్పరచుకొన్నారు. విందులో తోటి సిబ్బంది పాల్గొన్నారు. భౌతిక దూరం పాటించకుండా చేతికి మాస్కులు లేకుండా స్వీయ చిత్రాలు తీసుకున్నారు.

ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం మండలంలోని చత్రం గ్రామ సచివాలయ మహిళ పోలీసు, ఆమె భర్త హాజరు పట్టికను తీసుకెళ్లారని ఆ సచివాలయ సెక్రెటరీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మరవకముందే తిరిగి విందుకు, వినోదాలకు సచివాలయాలను అడ్డాగా మారుస్తున్నారని ప్రజలు విమర్శలు గుప్పించారు. సచివాలయాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని పలువురు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details