ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ న్యూస్

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈ నెల 5న చేపట్టనున్న రాష్ట్ర బంద్​కు మద్ధతుగా అనంతపురంలో విద్యార్థి సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతపురంలో విద్యార్థి సంఘాల నాయకుల బైక్ ర్యాలీ
అనంతపురంలో విద్యార్థి సంఘాల నాయకుల బైక్ ర్యాలీ

By

Published : Mar 3, 2021, 4:15 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 5న రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చారు. దీనికి మద్ధతుగా టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులు అనంతపురంలోని టవర్ క్లాక్ నుంచి ప్రధాన కూడలి మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి లేఖలు రాశామని కపటనాటకం అడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:గుంతకల్లులో వైకాపా ఇంటింటి ప్రచారం

ABOUT THE AUTHOR

...view details