పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో వైకాపా యువజన విభాగం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైకాపా కార్యాలయం నుంచి నగరంలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ఈ ర్యాలీ చేపట్టారు. 'ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్న తెదేపా అంశాలను ఖండిస్తున్నామంటూ ర్యాలీని సాగించారు. వైకాపా చేస్తున్న అభివృద్ధికి తెదేపా మద్దతు ఇవ్వాలని కోరారు.
మూడు రాజధానులకు మద్దతుగా అనంతపురంలో బైక్ ర్యాలీ - అనంతపురంలో వైకాపా బైక్ ర్యాలీ న్యూస్
మూడు రాజధానులకు మద్దతుగా అనంతపురంలో వైకాపా యువజన విభాగం నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి తెదేపా మద్ధతు ఇవ్వాలని కోరారు.
మూడు రాజధానులకు మద్దతుగా అనంతపురంలో బైక్ ర్యాలీ