ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యజమానుల కళ్లు గప్పి సైకిల్ దొంగతనం.. మూడో కన్నుకు చిక్కాడు.. - అనంతపురం జిల్లా తాజా వార్తలు

ఇంటియజమాని, పోలీసుల కళ్లు గప్పి పట్టపగలే సైకిల్​ను దొంగిలించాడు. కానీ ఆ దుండగుడిని..సీసీ కెమెరాలు పట్టించేశాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో జరిగింది.

Bicycle theft blindfolded by owners snapped at the cc camera at ananthapuram district
యజమానుల కళ్లు గప్పి సైకిల్ దొంగతనం.. మూడో కన్నుకు చిక్కాడు..

By

Published : Dec 14, 2020, 9:02 AM IST

యజమానుల కళ్లు గప్పి సైకిల్ దొంగతనం.. మూడో కన్నుకు చిక్కాడు..

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వాటర్ ట్యాంక్ వీధిలో భాజపా నాయకుడు దేవానంద్ ఇంటి ముందు ఉన్న సైకిల్​పై ఓ దుండగుడు కన్నేశాడు. సైకిల్ ఉన్న ప్రదేశంలో ఇంటి ముందు మెట్లపై కూర్చొని పరిసరాలను గమనించాడు. ఎవరూ లేని సమయంలో సైకిల్​ను ఎత్తుకుని పరారయ్యాడు. భాజపా నేత తన నివాసానికి కాపల ఉండే వ్యక్తికి కొనుగొలు చేయించారు. అందరూ ఇంట్లో ఉన్న సమయంలో ఇంటి ముందు నిలిపి ఉన్న సైకిల్​ను దొంగిలించాడు. ఈ దొంగతనానికి సంబంధించిన దేవానంద్ ఇంట్లో సీసీ కెమెరాల్లో రికార్డు అవటంతో.. వాటి అధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details