ప్రభుత్వం గేటు రూపంలో చిరు వ్యాపారుల నడ్డి విరుస్తోందని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైనోద్దీన్ ఆరోపించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారులకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. దీంతో కేవలం 5 గంటలు మాత్రమే క్రయ విక్రయాలు చేసుకొనే అవకాశముందన్నారు. ఇలాంటి సమయంలో చిరు వ్యాపారులపై వసూలు చేసే గేట్లను పెంచడం సరికాదన్నారు. పారిశుద్ధ్యం పేరుతో ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలన్న ఆలోచనను మున్సిపల్ యంత్రాంగం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలపై ఎలాంటి భారం మోపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
'పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. అధిక భారం మోపుతోంది' - భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైనోద్దీన్ వ్యాఖ్యలు
కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో చిరు వ్యాపారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారిపై అదనపు భారం మోపుతోందని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైనోద్దీన్ విమర్శించారు. కష్టకాలంలో వ్యాపారులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం గేటు రూపంలో వారి నడ్డి విరుస్తోందని ఆరోపించారు.
భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైనోద్దీన్