రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే విధంగా...వ్యవసాయ చట్టాలు అమలు చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ధరల స్థిరీకరణ వల్ల రైతులు, వ్యాపారులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ బిల్లుల వల్ల కలిగే లాభాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
'రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం' - అనంతపురం జిల్లా కదిరి
రైతులు పండించిన ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అన్నారు. దీనివల్ల అన్నదాతలకు, రైతులకు మేలు కలుగుతుందని అన్నారు.
రైతులకు గిట్టబాటు ధర