అనంతపురం శివారులోని తపోవనం సర్కిల్ వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేసి, ఎనిమిది చరవాణులు, రూ. లక్ష ఐదు వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
14 మంది బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు... నగదు, చరవాణులు స్వాధీనం - అనంతపురం క్రైం
అనంతపురంలో రెండు వేర్వేరు చోట్ల క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురంలో బెట్టింగ్ ముఠా అరెస్టు
గుత్తి రోడ్డు సమీపంలోని ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వారి నుంచి రూ. 51 వేల నగదు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: