వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం... చేనేత కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అర్హులైన తమ ఖాతాల్లో నగదు జమ కాలేదంటూ... నిత్యం అనంతపురంలోని చేనేత జౌళి శాఖ కార్యాలయం చుట్టూ వేల సంఖ్యలో చేనేత కార్మికులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు, అధికారులు చేసిన తప్పిదాలకు తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వాపోతున్నారు. తప్పిదాలను సవరించి త్వరగా తమకు పరిష్కారం చూపాలని కోరారు.
'వెఎస్సార్ నేతన్న నేస్తం... చేయట్లేదు సాయం' - ఏపీ ప్రభుత్వ పథకాలు
అనంతపురం జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారుల్లో... దాదాపు సగం మందికి నగదు జమ కాలేదు. వీటి కోసం పనులు మానుకుని చేనేత కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే సాంకేతిక కారణాల వల్లే ఇబ్బందులు తలెత్తాయని అధికారులు అంటున్నారు.
కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలు
ఈ సమస్యపై అధికారులను వివరణ కోరగా... జిల్లాలో 7,500 మంది చేనేత కార్మికులు ఉన్నారని... వీరిలో 2,900 మందికి పైగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాలేదని చెప్పుకొచ్చారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 13 వరకు గడువు ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నగదు జమవుతుందని తెలిపారు.
ఇదీ చదవండి:పకడ్బందీగా దిశ చట్టం అమలుకు సీఎం ఆదేశం