నేడు అంతర్జాతీయ పితృ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా పెన్సిల్ మొనపై సూక్ష్మ కలను ప్రదర్శించాడు అనంతపురం రాజీవ్ కాలనీకి చెందిన కళాకారుడు రాజేష్. తండ్రి ప్రేమకు గుర్తుగా తండ్రి వేలు పట్టుకుని ఉన్న చిన్నారి బొమ్మను, నాలుగు రకాల ఆసనాలను, గజ్జెలు కట్టిన పాదాన్ని 3 పెన్సిల్ల మొనలపై చెక్కాడు.
ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలని, ఆరోగ్యం కోసం నిత్యం యోగా చేయాలని, నృత్యం ఇష్టమున్నవారు నృత్య కళలో రాణించాలని ఆశిస్తూ వీటిని రూపొందించినట్లు రాజేశ్ తెలిపాడు. ఈ కళాకృతులను కాలనీవాసులు, చిన్నారులు ఆసక్తిగా తిలకించారు.