Bears Wandering in Kalyandurg hills: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం శివారులోని దాదా కొండల్లో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వాటిని పోన్లలో చిత్రీకరించిన స్థానికులు.. వెంటనే అటవీ శాఖ అధికారులకు పంపించారు. పట్టణ శివారులో ఎలుగుబంట్ల సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని శివారు కాలనీవాసులు అంటున్నారు.
కల్యాణదుర్గం కొండల్లో ఎలుగుబంట్ల సంచారం.. భయాందోళనలో స్థానికులు - కల్యాణదుర్గం కొండల్లో ఎలుగుబంట్ల సంచారం
Bears Wandering: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం కొండల్లో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి చేయడం, తాజాగా కల్యాణదుర్గం కొండల్లో సంచారం నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
రాష్ట్రంలోని పలుచోట్ల జనావాసాలకు సమీపంలోకి అడవి జంతువుల సంచారం పరిపాటుగా మారింది. దాదాపు నెల రోజులుగా కాకినాడ జిల్లాలో మకాం వేసిన పులి పశువులపై దాడులు చేస్తోంది. రెండురోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో జనాలపై ఎలుగుబంటి దాడి చేసింది. తాజాగా కల్యాణదుర్గంలో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పలు చోట్ల వన్యమృగాలు స్వైర విహారం నేపథ్యంలో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: