రైతుపై ఎలుగుబంట్ల దాడి.. తీవ్ర గాయాలు - కంబదూరులో రైతుపై ఎలుగుబంట్ల దాడి వార్తలు
అనంతపురం జిల్లా కంబదూరు మండలం మేళ్లకుంట గ్రామానికి చెందిన దాసరి నరసింహులు అనే రైతుపై మూడు ఎలుగుబంట్లు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లగా.. పొదల్లో ఉన్న ఎలుగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. తీవ్రంగా గాయపడ్డ అతను కేకలు వేయటంతో గమనించిన ఇరుగు పొరుగు రైతులు అతన్ని కల్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు.