అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పంటపొలాలపై అటవి జంతువుల దాడులు రైతులకు కునుకులేకుండా చేస్తున్నాయి.ఇటీవల పండ్ల తోటలకు వచ్చిన ఎలుగుబంట్లను స్థానిక యువత అడవుల్లో తరిమి కొట్టిన,అవి మళ్లి తరిగి వచ్చి పండ్ల తోటలను నాశనం చేస్తున్నాయి.మల్లాపురం గ్రామంలో ప్రభు అనే రైతు పొలంలో పుచ్చ పంటపై ఎలుగుబంట్లు దాడి చేశాయి.పంటలను రక్షించుకోడానికి బల్బులు వేసి తీగల్నీ కట్టిన ప్రయోజనం లేకుండా పోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికార్లు కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.లక్షలు పెట్టుబడి పెట్టి ఉద్యాన పంటలు సాగు చేస్తున్న తమ పంటలు అటవి జంతువుల పాలవుతున్నాయని కన్నీరు మున్నీరు అవుతున్నారు రైతులు.
పంటలపై ఎలుగుబంట్ల దాడితో కుదేలవుతోన్న రైతన్నలు - కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్ల దాడి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పంటపొలాలపై అటవి జంతువుల దాడితో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ పంటల్నీ కాపాడుకునే మార్గాలు చెప్పాలని, ఆటవీశాఖ అధికారులను అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
పంటలపై ఎలుగుబంట్ల దాడి..నష్టపోతున్న రైతులు