అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని పావగడలో ఎలుగుబంటి హల్చల్(bear halchal in streets of pavagada ) చేసింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో పట్టణంలోని శనీశ్వర దేవాలయం, బ్రాహ్మణ వీధి, సర్కిల్ ఏరియాలో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు.
పావగడలో ఎలుగుబంటి హల్చల్.. భయాందోళనలో స్థానికులు - పావగడ పట్టణంలో ఎలుగుబంటి సంచారం
అనంతపురం జిల్లా పావగడ పట్టణంలో శుక్రవారం రాత్రి ఓ ఎలుగుబంటి హల్చల్(bear halchal in streets of pavagada ) చేసింది. దీంతో పట్టణ వాసులు పరుగులు తీశారు.
పావగడ పట్టణంలో ఎలుగుబంటి హల్చల్
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. పోలీసు వాహనంలో హారన్ మోగిస్తూ ఎలుగుబంటిని వెంబడించారు(bear roaming on pavagada streets in Anantapur district). ఎట్టకేలకు ఎలుగును అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా చేశారు. నీటి కోసం కొండల్లో ఉన్న ఎలుగుబంట్లు.. జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీ అధికారులు ఆటవీ ప్రాంతాల్లో నీటి వసతులు ఏర్పాటు చేసి వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి..
Last Updated : Nov 9, 2021, 6:24 PM IST