Bear dead: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ముదిగల్లు సమీపంలో ఎలుగుబంటి మృతి చెందింది. ముదిగల్లు-పాలవాయి గ్రామాల సరిహద్దుల్లో ఎలుగుబంటి మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గత కొంతకాలంగా ముదిగల్లు కొండ ప్రాంతాలతో పాటు కల్యాణదుర్గం శివారు కొండల వద్ద మూడు ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తుండగా.. ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఇంతలో ఎలుగుబంటి ఒకటి మృతి చెందింది. మృతికి గల కారణాల మాత్రం ఇంకా తెలియలేదు.
అనంత జిల్లాలో ఎలుగుబంటి మృతి - ap news
గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా ప్రజలను ఎలుగుబంట్లు భయపెడుతున్నాయి. నిత్యం ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం గ్రామస్థులకు ఓ ఎలుగుబంటి కళేబరం కనిపించింది. వెంటనే వాళ్లు అటవీశాఖాధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఆ బంటి ఎలా చనిపోయిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..
1