Bear Attack : అనంతపురం జిల్లా సెట్టూరులోని యాటకల్లు గ్రామంలో హనుమంతరాయుడు అనే వాలంటీర్‌పై ఎలుగుబంటి దాడి చేసింది. తెల్లవారుజామున ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. దాడిలో గాయపడ్డ అతడ్ని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ఇటీవలె గ్రామంలో చిరుత సంచారం.. నేడు ఎలుగుబంటి ఇలా వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనలను గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని గ్రామంలోకి అడవి జంతువులు రాకుండా చూడాలని.. అందుకు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లాలో వాలంటీర్‌పై ఎలుగుబంటి దాడి.. భయాందోళనలో గ్రామస్థులు - నెేటి తెలుగు వార్తలు
Bear Attack on Volunteer : అనంతపురం జిల్లాలో ఓ వాలంటీర్‌పై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. అతని ఇంటి సమీపంలోనే ఎలుగుబంటి దాడి చేయటంతో గ్రామస్థులు.. భయందోళనకు గురవుతున్నారు. వన్యప్రాణులు ఇలా గ్రామంలోకి వచ్చి దాడి చేయటం వల్ల స్థానికులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.
![అనంతపురం జిల్లాలో వాలంటీర్‌పై ఎలుగుబంటి దాడి.. భయాందోళనలో గ్రామస్థులు Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17394158-590-17394158-1672825235348.jpg)
Etv Bharat
అనంతపురం జిల్లాలో వాలంటీర్‌పై ఎలుగుబంటి దాడి