అనంతపురం జిల్లా తలుపుల బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం తనిఖీల్లో బయటపడింది. ఆ శాఖ అధికారి యుగంధర్ వసతి గృహాన్నిఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం వసతి గృహంలో 120మంది విద్యార్థులుండగా ... కేవలం17 మంది విద్యార్థులు మాత్రమే గృహానికి వచ్చారు. సిబ్బంది సైతం అందుబాటులో లేరు. అంతేగాక.. రికార్డులు ఉన్న గదికి తాళం వేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.
తనిఖీలకు వెళ్లిన ఉన్నతాధికారి.. కనిపించని సిబ్బంది! - 'తలుపుల బీసీ సంక్షేమ శాఖ వసతి గృహం తాజా వార్తలు
అనంతపురం జిల్లా మండల కేంద్రంలోని బీసీ వసతి గృహ సిబ్బందిపై.. ఆ శాఖ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక తనీఖీ చేయగా.. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరక్కడ. అంతేగాక రికార్డుల ప్రకారం గృహంలో 120 మంది విద్యార్థులుండగా... 17 మంది మాత్రమే గృహంలో ఉన్నారు.
![తనిఖీలకు వెళ్లిన ఉన్నతాధికారి.. కనిపించని సిబ్బంది! BC Welfare Officer inspected at talupula BC Welfare hostel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11187702-758-11187702-1616897705152.jpg)
బీసీ వసతిగృహ ఉన్నతాధికారి తనిఖీ.