స్మశాన వాటికలను ఉద్యాన వనాలుగా మార్చేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. తాను క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన సమయంలో చాలా ఊళ్లలో స్మశానవాటికలు అధ్వాన్నంగా ఉండటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. వాటిలో మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగా స్మశానవాటికలను ఉద్యానవనాలు, అందమైన పేయింటింగ్ లతో అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో అన్ని కులాలు, మతాలను గౌరవిస్తామని ఎంపీ రంగయ్య స్పష్టం చేశారు. ఎంపీ నిధులు, ఎన్.ఆర్.జి.ఎస్ నిధులు వెచ్చిస్తామన్నారు.
ఉద్యాన వనాలుగా మారనున్న స్మశానవాటికలు - anathapuram district
స్మశానవాటికలను ఉద్యాన వనాలుగా తీర్చిదిద్దుతామని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. అధ్వాన్నంగా ఉన్న స్మశానవాటికలను మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
ఉద్యాన వనాలుగా మారనున్న స్మశానవాటికలు