ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాళ్లు తీసుకున్న అప్పు చెల్లించండి.. బ్యాంకుల నుంచి వేధింపుల కాల్స్

Loan Harassment: అప్పు చేసింది ఒకరు.. వేధింపులు మాత్రం మరొకరికి.. వాళ్లు అప్పు తీసుకున్న సంగతి వీళ్లకు తెలియదు.. అయినా వీరికి ఫోన్లు మాత్రం ఆగవు. ఒక్కోసారి ఒక్కో బ్యాంకు పేరు చెప్పి తీసుకున్న డబ్బులు చెల్లించాలని, అసభ్యకరంగా తిడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దీంతో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Harassment calls
వేధింపు కాల్స్

By

Published : Jan 10, 2023, 8:43 PM IST

Updated : Jan 10, 2023, 8:53 PM IST

Loan Harassment: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని జనచైతన్య కాలనీకి చెందిన వడ్డె రవికుమార్, వడ్డె వరలక్ష్మి అప్పు ఉన్నారని, మీరు చెల్లించాలని బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి వేధిస్తున్నారని అదే కాలనీకి చెందిన కొందరు మహిళలు అనంతపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఒక్కోసారి ఒక్కో బ్యాంకు పేరు చెప్పి తీసుకున్న డబ్బులు చెల్లించాలని, అసభ్యకరంగా తిడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వారం రోజుల నుంచి రోజుకు 20 నుంచి 50కి పైగా ఫోన్ కాల్స్ చేసి.. వడ్డే రవికుమార్, వడ్డే వరలక్ష్మి తీసుకున్న అప్పు చెల్లించాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని వరలక్ష్మి, వడ్డె రవికుమారులను కలిసి అడగ్గా.. ఆ నెంబర్ల నుంచి వచ్చే ఫోన్లో మాట్లాడవద్దని చెబుతున్నారని తెలిపారు. లోన్ యాపులు వేధింపుల కన్నా దారుణంగా ఉన్నాయని.. అధికారులు చర్యలు తీసుకొని వేధిస్తున్న నిందితులను పట్టుకొని చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు కోరారు.

అప్పు చెల్లించాలని వేధిస్తున్నారు

ఇవీ చదవండి:

Last Updated : Jan 10, 2023, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details