అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వెంకటంపల్లిలో మంగళవారం సాయంత్రం సరస్వతి అనే మహిళా రైతుకు చెందిన అరటి తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మూడు ఎకరాల తోట కాలిపోయింది. మూడు లక్షల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. తమను ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు.
మూడెకరాల్లో అరటి తోట దగ్ధం...రూ.3లక్షల నష్టం - Anantapur district news
చేతికొచ్చిన పంట అగ్గిపాలు కావడంతో ఆ రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటను అమ్ముకొని ఉన్న కాస్త అప్పు తీర్చలనుకున్నారు. ఇంతలోనే ప్రమాదవశాత్తు అరటి తోటకు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది.ఈ ఘటన వజ్రకరూర్ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది.
అరటి పంట దగ్ధం