ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హ్యాపీ బనానా... అనంత టూ అరబ్..! - banana export to gulf countries from anatapur

కరవుసీమ అనంతపురం జిల్లాలో పండిన నాణ్యమైన అరటి పంట తొలిసారిగా గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఉద్యాన శాఖ, గుజరాత్‌కు చెందిన దేశాయ్‌ కంపెనీ అందుకు ఏర్పాట్లు చేశాయి. తాడిపత్రి నుంచి ఈ ఎగుమతిని ప్రారంభించారు. తొలివిడతగా 890 మెట్రిక్‌ టన్నుల అరటిని ప్యాకింగ్‌ చేసి కంటైనర్లలో తరలించారు. '‘హ్యాపీ బనానా'’ పేరుతో ఇక్కడి అరటి సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, దుబాయ్‌ ప్రాంతాలకు వెళ్లనుంది.

banana export to arab countries from anatapur
హ్యాపీ బనానా... అనంత టూ అరబ్..!

By

Published : Jan 30, 2020, 6:19 PM IST

Updated : Jan 30, 2020, 7:31 PM IST

హ్యాపీ బనానా... అనంత టూ అరబ్..!

దేశంలోనే మొట్టమొదటి సారిగా గూడ్స్​ రైలుకు ఏసీ కంటైనర్లు ఏర్పాటు చేసి... అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి అరటిపండ్లను అరబ్ దేశాలకు ఎగుమతి చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లాల్లో పండే అరటి పండ్లకు నాణ్యత ఎక్కువ. గుజరాత్​కు చెందిన దేశాయి కంపెనీ... 'హ్యాపీ బనానా' పేరుతో అరటి పండ్లు కొనుగోలుకు ముందుకొచ్చింది. ఈ కంపెనీ వారు పంట ప్రారంభ దశ నుంచే... అరటి నాణ్యత బాగుండేలా రైతులకు ఉచితంగా సామగ్రి అందిస్తారు.

పంటకోత సమయానికి మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. ఈ కంపెనీ వల్ల రైతులు దళారుల చేతుల్లో దగా పడకుండా... తమ పంటను నష్టం లేకుండా అమ్ముకోవచ్చు. కంపెనీ వారు అరటి పండ్లను ఒక వినూత్న పద్ధతిలో ప్యాక్ చేసి ఏసీ కంటైనర్లలో ఉంచుతారు. రైలు మార్గం ద్వారా ఈ కంటైనర్లు దేశ సరిహద్దు వరకు వెళతాయి. అక్కడి నుంచి షిప్​ల ద్వారా అరబ్ దేశాలకు చేరవేస్తారు. ప్రారంభం రోజునే 49 కంటైనర్లలో... 980 మెట్రిక్ టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేశారు.

అనంత జిల్లాలో పండే ఉద్యాన పంటలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని... రాష్ట్రంలో పండే ఉద్యాన పంటలో 30 శాతం అనంతపురం జిల్లాలోనే పండుతాయని అధికారులు వివరింస్తున్నారు.

ఇదీ చదవండీ...

నేటి నుంచి విదేశాలకు 'అనంత' అరటి

Last Updated : Jan 30, 2020, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details