ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఉద్యాన పంట రైతులు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. . అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వర్షపు నీరు పంట పొలాల్లో అధికంగా ఉండడంతో అరటి, మిరప, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అహర్నిశలు కష్టపడి పండించిన పంటలు... అకాల వర్షాలకు నేలరాలయాయని కర్షకులు వాపోయారు.
జిల్లాలోఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో అరటిపంటను సాగు చేశారు. పంట వేసిన కొన్ని నెలలకే జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురవడంతో వర్షపు నీరు పంట పొలాల్లో ఉండిపోయింది. మోటర్లు ద్వారా, దిగువకు గుంతలు తవ్వి బయటకు నీళ్లు వదిలిన కూడా లాభం లేకుండా పోయింది. భూమిలో నుంచి నీళ్లు ఉబికి వస్తుండటంతో పంట పాడైాంది. చేసేదేమిలేక జేసీబీ ద్వారా అరటి చెట్లను తొలగించారు.
నాలుగు ఎకరాలకు కలిపి 5500 అరటి మొక్కలు నాటితే ...భారీ వర్షాల కారణంగా మొత్తం పంట దెబ్బతింది. అందువల్లే జేసీబీ సహాయంతో పంటను తొలగించాం