ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో అకాల వర్షాలు.. నేలపాలైన అరటి, మామిడి - today Banana and mango crop damaged by rains news update

అనంతపురం జిల్లాలో అకాల వర్షాలకు అరటి, మామిడి పంటలు నేలకొరిగాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి... చేతికి వచ్చిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేలకొరిగిన అరటి పంట
నేలకొరిగిన అరటి పంట

By

Published : May 16, 2021, 2:30 PM IST

ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలకు.. అనంతపురం జిల్లాలో చేతికి అందొచ్చిన అరటి పంట నేల కొరిగింది. మామిడికాయలు నేల రాలిపోయాయి. కదిరి, నల్లచెరువు మండలాల్లో పడిన వర్షాల కారణంగా.. మామిడి, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

నల్లచెరువు మండలంలో ఎక్కువ భాగం అరటి దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. కదిరి మండలంలో మల్లయ్య గారి పల్లి, కె.బ్రహ్మణపల్లి పంచాయతీల్లో 30 ఎకరాల్లోని మామిడి తోటల్లో కాయలు నేల రాలిపోయాయి. ఇన్నాళ్లు పంటను కాపాడుకుంటూ వచ్చామని.. చేతికి అందే సమయంలో కాయలన్నీ నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details