ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వప్నకు శస్త్రచికిత్స.. పరామర్శించిన బాలకృష్ణ - balakrishna visitation to swapna

అనంతపురంలో బోన్​క్యాన్సర్​తో బాధపడుతూ.. హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వప్నను నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. త్వరలోనే కోలుకుంటావని ధైర్యం చెప్పారు.

balakrishna visitation to swapna
స్వప్నకు శస్త్రచికిత్స.. పరామర్శించిన బాలకృష్ణ

By

Published : Nov 30, 2019, 1:28 PM IST

అనంతపురంలో బోన్​క్యాన్సర్​తో బాధపడుతున్న స్వప్నకు హైదరాబాద్​లోని బసవతారకం ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. యువతి ఆరోగ్య పరిస్థితిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సర్జరీ చేయాలంటే ముందుగా వ్యాధి సోకిన కాలు తీసివేయాలని భావించిన వైద్యులు.. బాలకృష్ణ సూచనతో కాలులో రాడ్డు వేసి శస్త్రచికిత్స చేశారు. నిన్న యువతిని పరామర్శించిన బాలకృష్ణ.. త్వరలోనే కోలుకుంటావని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. బాగా చదువుకుని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని సూచించారు. దీనిపై స్పందించిన స్వప్న కచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details